Wednesday, December 14, 2016

గిప్పడి సంది జర పయిలంగా పో...

ఇది ప్రతిరోజు జరిగే సంఘటనే! ఎంత మంది ఎన్నిసార్లు హెచ్చరించిన మరుసటి రోజు మళ్ళీ అదే జరుగుతుంది. మరి ఇప్పుడు నేను చెప్తే వాళ్ళ నెత్తికి ఎక్కుతుందా అంటే అదీ లేదు. కాని ఆగలేక చెప్పాలనుకుంటున్నాను. అతి వేగంగా నువ్వు రోడ్డు మీద వెళ్ళ్తే చూసి తిట్టేవాళ్ళు తప్ప, సన్మానం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అబ్బో ఇంకొందరి గురించి చెప్పనవసరం లేదు, బండ్ల నడుమ సందు ఉన్నాలేకున్నా వీళ్ళదెప్పుడూ పాము పోకటే. ఇంకొందరికి రెడ్ సిగ్నల్ పడితే ఆగాలన్నా కనీస విచక్షణ కూడా ఉండదు. వేరే వాహనాలకు దారివ్వరు, పాదచారులను రోడ్డు దాటనివ్వరు. వీళ్ళని చూస్తే ఒక విషయం వారిని సూటిగా అడగాలనిపిస్తుంది.

"మీరు మీ రోజులో ఒక రెండు నిమిషాలు కూడా వృధా చేయరా? రోడ్డు సిగ్నల్ దగ్గర ఇతరుల సౌఖర్యం కొరకు రెండు నిమిషాలు కూడా వెచ్చించకుండా మీరు చేసే పీకుడు పని ఏంటి? సమయాన్ని దుర్వినియోగం చేయకపోవడం మంచిదే కానీ ఎంత మూల్యానికీ? ఐదు నిమిషాలు మిగులుతాయినుకుంటే ఆరు నెలలు మంచాన పడాల్సి వస్తుందేమో ఒకసారి ఆలోచించు!
              క్యాంటీన్ బల్లాల మీద సొళ్ళు కబుర్లు, ఆఫీసు క్యాబీన్ల దగ్గర రౌండ్ టేబుల్ సమావేశాలు, ఫేస్బుక్కుల్లో చిట్ చాట్ లు, సెల్ ఫోన్లలో గుసగుసలు.... వీటన్నింటికీ కాలం తగలబెడుతారు కదా. మరెందుకు బండి మీద కూర్చోగానే స్పేస్ రన్ లో ఉన్నట్లు దూసుకెళ్తారు? మీకు బుల్లెట్ ల దుసుకెళ్ళాలనే మోజుంటే, మీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రేస్ ట్రాక్ లున్నాయి. అక్కడ దారికి అడ్డంగా ఒక్క పురుగు కూడ రాదు, అక్కడికి వెళ్ళి మీ యావ తీర్చుకోండి కాని జనం మధ్య కాదు.
మరోసారి చెప్తున్నా...
  1. Red signal దగ్గర ఆగండి. వేరే వాహనాలకు దారివ్వండి.
  2. Pedestrian crossing signal దగ్గర ఆగండి. పాదచారలను గౌరవించండి.
  3. Speed limit sign board ను చూసి నడపండి."
అయిన వేలాకోలం కాకపోతే, అంత బీజీగా ఉన్న వాళ్ళు నా పోస్ట్ ఎందుకు చదువుతారులే!

2 comments:

  1. బాగుందండీ మీరు చెప్పేది. హైదరాబాదులో మోటర్ సైకిళ్లు ఫుట్పాత్ ల మీద కూడా వెళ్ళిపోతుంటాయి. అంతటి పరాకాష్ఠకు జేరింది ట్రాఫిక్ క్రమశిక్షణారాహిత్యం.

    ReplyDelete