Sunday, May 10, 2015

లవ్ అండ్ సెక్స్

ప్రేమ పేరుతో మోసపోయిన ఒక మహిళ – ఇలాంటి వార్తలు టీ.వీ.లలో పేపర్లలో చూసి చదివి తిట్టుకొని జీర్ణించుకుంటాము. అయితే,  ప్రేమ, సెక్స్ ఈ రెండిటిలో దేనికి యువత ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది? వీటి మీద యువతకున్న అభిప్రాయం ఎటువంటిది? అవును, కాస్త ఆలోచించాల్సిన విషయమే. “మనసులు, మనుషులు కలసిన తర్వాతే శరీరాలు కలవాలి” అనే ధృక్పదం సెక్స్ కి ఎంతో విలువనిస్తుంది. ప్రేమ, పెళ్ళి ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాంతం ప్రయాణం చేయడానికి మైలు రాళ్ళయితే సెక్స్ అనేది మన తరాన్ని ముందుకు తీసుకువెళ్ళే మాద్యమం. అలాంటప్పుడు సెక్స్ ని మన జీవితంలోకి ఆహ్వానించే అర్హత పొందాలేతప్ప మన శారీరక వాంఛలను తీర్చే వస్తువుగా వాడుకోకూడదు. రోజంతా గొడవపడ్డ ఆలుమగలకి రాత్రి కలుసుకోవడానికి ఉపయోగపడే మెడిసిన్ అస్సలు కాకూడదు. శృంగారంతో ప్రేమను వ్యక్తపరచవచ్చన్న పిచ్చి బుచ్చయ్య మాటలు పక్కన పెట్టి ప్రాధానంగా మనసులు కలిసే ఆలోచనలో ఉంటే బాగుంటుంది.
“ప్రేమ కొందరిని మాత్రమే వరిస్తుంది. దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.”

3 comments:

  1. చివరలో message అదిరింది... :-)

    ReplyDelete
  2. ప్రేమ అంటేనే ఒక బుచికి పదార్థం.

    ReplyDelete
    Replies
    1. మీ వాఖ్యతో నవ్వు తెప్పించారండి :-)

      Delete