Sunday, May 10, 2015

ప్రేమ – ఒక మానసిక రుగ్మత!!!

ప్రేమ ఒక తియ్యని బాధ. ఈ వ్యాధి సోకితే ఎలా ఉంటుందో మీకు తెలుసనుకుంటాను! ఎప్పుడూ ప్రేయసిని గురించిన ఆలోచనలే దగ్గరవ్వాలన్న కోరికలే - ఒంటరిగా ఉన్నాసరే, పదిమందిలో ఉన్నాసరే. ఈ లోకంతో సంబంధం లేకుండా ఊహాలోకంలో విహరిస్తూ ఆనందిస్తారు. నిప్పులు కురిపించే నిజజీవిత పరిస్థితుల గురించి వీరికి అనవసరం, నువ్వు నా చెంత ఒక్క క్షణం ఉంటే చాలన్న పిచ్చి మనస్తత్వం వీరిది. అవును, జీవితాంతం నీ పక్కన ఉండాలన్న కోరిక నుండి ఒక్క క్షణం నీతో ఉంటే చాలన్న బేరానికి వస్తారు.
ఈ వ్యాధి సొకిన విషయం కొన్ని సందర్భాలలో మొదట్లోనే తెలియవచ్చు లేదా ఆలస్యంగానైన తెలియవచ్చు. ఈ వ్యాధి సోకిందని రోగి(ప్రేమికుడు/ప్రేమికురాలు) తన్నంతట తానుగా లేదా ఇంకెవరి వల్లనైన తెలుసుకోవచ్చు. అయితే ఈ వ్యాధిని ఆకర్షణ అని ఊరికే నిర్లక్ష్యం చేసే సందర్భాలున్నాయి. నాకు ఈ వ్యాధి కలిగిందని సంతోషపడి తర్వాత అది వ్యాధి కాదు కేవలం ఆకర్షణ మాత్రమే అని బాధపడే వాళ్ళూ ఉన్నారు. ఈ వ్యాధి విరుగుడుకి ఎలాంటి మెడికల్ క్యాంప్స్ ఉండవు, వ్యాధి నిర్మూలణకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరపరు. బహుశా, ప్రభుత్వానికి తెలుసేమో ఈ వ్యాధిని నయం చేయలేమని, అరికట్టలేమని. కావున దీనిని నయం చేయడమన్న మాటని పక్కన పెడితే, కంట్రోల్ చేసుకోవడం ఒక్కటే పరిష్కారం. ఈ వ్యాధికి ఎవరైతే కారణమో వారిని జీవిత భాగస్వామిగా చేసుకోని వ్యాధిని అదుపులో పెట్టుకోవడం ఒక్కటే ఉత్తమమైన మార్గం.

5 comments:

  1. ప్రేమ లేదు గీమ లేదు. శారీరిక వాంఛ , ఒకరికొకరు అవసరం ఉన్నంతవరకే ప్రేమ. తరువాత తూనా బొడ్డూ.

    ReplyDelete
  2. ప్రేమ ఒక ప్రాకృతిక భావోద్వేగం. మానసిక రోగాలు వేరే ఉన్నాయి. ఉదాహరణకు-మతంభక్తి.

    ReplyDelete